భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నారాయణఖేడ్ నుండి సీపీఐ పార్టీ నాయకులు భారీ ఎత్తున నల్గొండ బహిరంగ సభకి బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ సీపీఐ పార్టీ పేదల పార్టీ అని వంద సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పాటుపడిన పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు.