నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరం పేట్ మండలానికి చెందిన శ్రీనివాస్ చారి గాంధీజి జయంతి సందర్బంగా బొటన వేలి గోరుపై గాంధీజి చిత్రంతో పాటు జాతీయ జెండా ను బుధవారం డ్రాయింగ్ చిత్రికరించారు. గతంలో శ్రీనివాస్ చింత గింజలపై, గాంధీ, భగత్ సింగ్ భారతదేశ పటాన్ని రూపొందించారు. తాను పటాలు వేసి గిన్నిస్ బుక్ లో చేరాలనే ఆకాంక్షని తెలిపారు.