నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మంగల్ పేట్ లో మంగళవారం వీరభద్రేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు శెట్టి శంకర్, వారి కుమారులు, విట్టల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.