నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట్ గ్రామానికి చెందిన మైపాల్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 28, 500 రూపాయలు మంజూరైయ్యాయి. చెక్కును బుధవారం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి వారి తల్లి సుశీలకి మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. వారితోపాటు మాజీ ఎంపీటీసీ భూపాల్, నాయకులు సాయిలు, నాగారం అంజయ్య, శ్రీను, సత్యం, శ్రీనివాస్, మాదయ్య, రాములు, హనుమయ్య, కిష్టయ్య తదితరులు ఉన్నారు.