నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలకు సంబంధించి మండల స్థాయి కమిటీ మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయి కమిటీలో చైర్మన్గా మండల స్పెషల్ ఆఫీసర్, కన్వీనర్ గా ఎంపీడీవో, ఎంఈఓ, తహసిల్దారు, ఎస్సై, పిఈటిలు మెంబర్లుగా ఉన్నారు. వీరందరూ సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.