టీపీసీసీ, ఓబీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన ముఖ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కు వచ్చిన ఓబీసీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షుడు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజన్ కుమార్, మాజీ ఎంపీ ఐరావతి అనిల్, శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.