పిల్లల పట్ల తల్లిదండ్రులు తస్మా జాగ్రత్త: ఎస్ఐ

63చూసినవారు
పిల్లల పట్ల తల్లిదండ్రులు తస్మా జాగ్రత్త: ఎస్ఐ
సిర్గపూర్ మండల పరిధిలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ మండల పరిధిలోని స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు దసరా సెలవులు వస్తున్న తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. చెరువులు, నదుల వద్దకు పోయి స్విమ్మింగ్ అని నీళ్లల్లో దూకి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్