ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలని ఎంపీడీవో సత్తయ్య అన్నారు. శనివారం కంగ్టి మండల తడ్కల్, ఎడ్లరెగడి తండా, రాసోల్ గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. సర్వే ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు జ్ఞాన్ దేవ్, తదితరులు పాల్గొన్నారు.