కొడకంచిలో ఘనంగా బోనాల పండుగ

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు భారీ స్థాయిలో బోనాలతో తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్