గుర్తుతెలియని మహిళ హత్య కేసులో సమగ్ర విచారణ చేపడుతున్నామని జిన్నారం సీఐ నయీముద్దీన్ ఆదివారం తెలిపారు. హత్నూర మండలం నస్తీపూర్ శివార్లో హత్యకు గురైన మహిళ సుమారు 25 ఏళ్ల యువతిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ క్లూస్ టీం, డాగ్ స్క్వయిడ్ సహాయంతో విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. ఎవరైనా ఆమెను గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.