ఐలాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యాలయం గ్రామ ప్రజలకు పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రబిందువుగా నిలుస్తుంది అన్నారు. అనంతరం, మానిక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించి విజేతలకు ట్రోఫీని అందజేశారు. క్రీడలు యువతలో ఉత్తేజం నింపి, సమాజ అభివృద్ధికి దోహద పడతాయన్నారు.