మలిదశ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ కీలక పాత్ర

77చూసినవారు
మలిదశ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ కీలక పాత్ర
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఎండీఆర్ ఫౌండేషన్ కో - ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ఆయనకు నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాధన తొలిదశ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారని గుర్తు చేశారు. మలి దశ ఉద్యమంలోనూ తన వంతు కీలక పాత్ర పోషించారన్నారు.

సంబంధిత పోస్ట్