పటాన్ చేరు పట్టణం లో మహమ్మద్ ఆసిఫ్ అలీ సబ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్ పక్కన, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న నిరాశ్రయులైన పేదలకు దుప్పట్ల పంపిణీ చేసి ఉదారత చాటుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ అలి తమ సిబ్బందితో కలిసి పటాన్ చేరు బస్ స్టాండ్ సమీపంలో చలిలో గజ గజ వణికిపోతున్న పరిస్థితిని చూసి చలించిపోయి నిద్రావస్థలో వున్న పేదలకు దుప్పట్లు కప్పి మానవత్వాన్ని చాటుకున్నారు.