
5న అసెంబ్లీ సమావేశం.. కులగణనకు ఆమోదం?
TG: ఆదివారం కేబినెట్ సబ్‌కమిటీ ముందుకు కులగణన నివేదిక రానుంది. మ.2 గంటలకు ప్లానింగ్ కమిషన్ నివేదిక అందించనుంది. దీంతో సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్ ఛాంబర్లో మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, పొన్నం, ఎంపీ మల్లురవి ఆదివారం సమావేశం కానున్నారు. ఈనెల 5న ప్లానింగ్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంతరం అదే రోజున మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సభలో ప్రభుత్వం కులగణన నివేదిక ప్రవేశపెట్టనుంది. నివేదికపై చర్చ అనంతరం కులగణనకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.