ఆమీన్ పూర్ సంత కొనసాగించాలని వినతి

80చూసినవారు
ఆమీన్ పూర్ సంత కొనసాగించాలని వినతి
ఆమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ వద్ద జరిగే సంతను కొనసాగించేల చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వ్యాపారులు బుధవారం వినతి పత్రం సమర్పించారు. బీరంగూడ వద్ద ఉన్న సంతను సోమవారం మున్సిపల్ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు, చిరు వ్యాపారులు తమ కూరగాయలను విక్రయించుకుంటారని చెప్పారు. స్పందించి సంత నిర్వహించేల చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్