కొండాపూర్ మండలం మారేపల్లిలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వికారాబాద్ కు చెందిన పండరీనాథ్, రమేష్ మూడు లక్షల రూపాయల విరాళాన్ని బుధవారం నిర్వాహకులకు అందించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. పండరీనాథ్ రమేష్ ను దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.