హామీలు అమలు చేయమంటే అరెస్టు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యాదగిరి అన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ కు వెళ్తున్న సీఐటీయూ నాయకులను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు మంగళవారం తరలించారు. యాదగిరి మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.