ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్స ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన అన్నారు. సంగారెడ్డి కంది మండలంలో గురువారం పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు సర్వేలు పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.