అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శివాజీ నగర్, మంజీర నగర్ లలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వల్లూరు క్రాంతితో కలిసి శుక్రవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.