గిరిజన చిన్నారిపై అత్యాచారం చేసిన దుండగులను ఉరి తియ్యాలి

1161చూసినవారు
గిరిజన చిన్నారి పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని గిరిజన సంక్షేమ సంగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ శనివారం డిమాండ్ చేసారు. హైదరాబాద్ సింగరేణి కాలనీ సైదాబాద్ లో చిన్నారి చైత్రబాయి పై అత్యాచారం హత్య దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం తేల్ దార్ పల్లి నక్కలగండి తండా గ్రామ పంచాయతీకి చెందిన దంపతుల కుటుంబం బతుకుదెరువు కోసమని హైదరాబాద్ కు వచ్చి సింగరేణి కాలనీ గుడిసేలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ దంపతుల గారాల పట్టి అయిన సభవాట్ చైత్ర బాయి ఆరు సంవత్సరాల పాప. ఆమెను రాజు అనే ఒక మానవ మృగాడు అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం బహిరంగ ఉరితీయాలి అన్నారు. శనివారం నాడు సాయంత్రం సంగారెడ్డిలో నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ గిరిజన సంక్షేమ సంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు పూల్సిగ్ నాయక్, రాణా రాథోడ్, కవిరమ్ , హరి డాక్టర్ , ఓంకార్, శివాజీ, రాజు , సేనదిపతి, కిషన్ నాయక్, శ్రీనివాస్ ప్రకాష్ నవీన్ , కళ్యాణ్ , రవీందర్ , సూరి, ప్రకాష్, మహేష్ వికాస్ , వాసు , సురేష్, పవన్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్