సంగారెడ్డి పట్టణంలోని సోమ వంశీయ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 100 మందికి పైగా మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అర్చకులు వరలక్ష్మి వ్రతం గురించి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో సోమ వంశీయ క్షత్రియ సమాజం సభ్యులు పాల్గొన్నారు.