జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో చిన్న వర్షానికే రోడ్డు నీట మునిగిపోయినది. చిన్న పాటి వర్షం పడిన గుంతలు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చీకట్లో ప్రమాదాలు జరగవచ్చని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ నుంచి మల్చల్మ వరకు ధ్వంసమైన రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.