సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అడిషనల్ డీఈఓ శంకర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మోసం చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాల గుర్తించి వెంటనే వాటిని మూసివేయాలని తెలిపారు.