ఫెర్టిలైజర్ షాపుల యాజమానులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని తహశీల్దార్ హసీనా బేగం, ఏవో వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మొగుడంపల్లి మండల కేంద్రంలో పలు ఫెర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ రికార్డులను సక్రమంగా మెయింటెన్ చేయాలని, రైతులు కొన్న విత్తనాలు, ఎరువులకు రశీదులు అందించాలన్నారు.