జహీరాబాద్: తులసి వనంలో కార్తీక దీపారాధన

76చూసినవారు
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం బడంపేట భద్రకాళి సమేత రాచన్న స్వామి ఆలయంలో శనివారం కార్తీక మాసం దీపారాధన ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆలయం ఈవో శివరుద్రప్ప ఆధ్వర్యంలో స్థానిక తులసీ తోటలో తులసి కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్