జహీరాబాద్ పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు హైస్కూల్లో నూతన సంవత్సర క్యాలెండర్ ను పాఠశాల వ్యవస్థాపకులు వెంకటయ్య గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో వీధి ప్రజల సహకారంతో 16 మందితో ప్రారంభమైన పాఠశాల 40 సంవత్సరాలు పూర్తయినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పాఠశాలలో చదివిన విద్యార్థులు వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా స్థిరపడటం ఎంతో సంతోషమని అన్నారు.