దిడిగిలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.