స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తార్నాకలోని కిమితి కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థిని సాత్విక స్కూల్‌కు వెళ్లేందుకు ఉదయం ఆటోలో బయలుదేరింది. హబ్సిగూడ చౌరస్తాలో సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందున్న బస్సు కిందికి దూసుకెళ్లింది. దీంతో ఆటో డ్రైవర్ ఎల్లయ్య, సాత్విక గాయపడగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వాతిక మృతి చెందగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.