పలు వాహనాలను ఢీకొట్టిన స్కూల్ బస్సు (వీడియో)

82చూసినవారు
హర్యానాలోని హిస్సార్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. 9వ నెంబరు జాతీయ రహదారిపై 40 మంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిన్నారులతో నిండిన బస్సు వేగంగా దూసుకెళ్లింది. అదుపుతప్పి పలు వాహనాలను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కారు నుజ్జునుజ్జు అయింది. అదృష్టవశాత్తూ కారులోని ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్