నాగర్ కర్నూల్(D) SLBC టన్నెల్ కార్మికులు చిక్కుకుపోయి 23 రోజులు అవుతున్నా వారి ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక చర్యలకు బురద, జలపాతంలా వస్తున్న ఊటనీరు పనులకు అడ్డంకిగా మారాయి. దీంతో మానవుల కంటే 15 రెట్లు అధికంగా పనిచేయగల అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలను పనుల్లో వినియోగించనున్నారు. టన్నెల్ లో డీ-1 పాయింట్ వద్ద తవ్వేందుకు వీటిని ఉపయోగిస్తారు. అటు టన్నెల్ వద్ద తమ వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.