హైదరాబాద్​లో రేపు 144 సెక్షన్

82చూసినవారు
హైదరాబాద్​లో రేపు 144 సెక్షన్
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్న చోట వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్