AP: రాష్ట్రంలోని పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట పోర్టుల పరిధిలో 8 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. 100 కి.మీ.ల పరిధిని ప్రాక్సిమల్ ఏరియాగా నిర్ణయించింది. పోర్టు నుంచి 25 కి.మీ.ల పరిధిలోని నగరాలను అభివృద్ధి చేయనుంది.