రేణిగుంట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబును అడ్డు కోవడం అప్రజాస్వామ్యం అని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ మండిపడ్డారు.