తెలంగాలణలో ముఖ్య కార్యదర్శి (CS) మార్పు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాంతి కుమారి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా, ఆమె ముందుగా వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.