తన కూతురు, నటి సోనాక్షి సిన్హా వివాహంపై ఎట్టకేలకు శత్రుఘ్న సిన్హా పెదవివిప్పారు. సోనాక్షి ఈనెల 23న ముంబైలో జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. తన కూతురి వివాహ ప్రణాళికలపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని శత్రుఘ్న సిన్హా చెప్పారు. సోనాక్షి, జహీర్ వివాహం గురించి తనకు తెలియదని అన్నారు. తానూ మీడియాలో వచ్చిన వార్తలతోనే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. సోనాక్షి ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదని అన్నారు.