న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. (వీడియో)

74చూసినవారు
అమెరికాలోని న్యూయార్క్‌లోని బ్రాంక్స్ సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం కాల్పులకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ వాదన ఏమిటో తనకు తెలియదన్నారు. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్