పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు (వీడియో)

85చూసినవారు
రాంచీలోని ఓ బార్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక దారుణం జరిగింది. బార్ మూసేసిన తర్వాత ఐదుగురు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. మద్యం కావాలని అడిగారు. దీనికి బార్ సిబ్బంది నిరాకరించారు. దీంతో దుండగులలో ఒకరు తుపాకీ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో బార్‌లోని DJ సందీప్‌ను కాల్చాడు. బార్ సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :