లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

84చూసినవారు
లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
AP: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కర్నూలు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెచ్‌జిహల్లికి చెందిన రంగముని.. 2021 ఆగస్టులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2021 ఆగస్టు 13న హొళగుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోక్సో న్యాయస్థానం.. నిందితుడికి జీవిత ఖైదు సహా రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువ‌రించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్