దుబ్బాక పురపాలికలోని లచ్చపేట ఆదర్శ పాఠశాలను మంగళవారం దుబ్బాక ఎంపీడీవో భాస్కర శర్మ, తహశీల్దార్ సంజీవ్ కుమార్, సీఐ పాలెపు శ్రీనివాస్, పుర కమిషనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీ చేసింది. పాఠశాలలో వంటగదిని, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని అధికారులు స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యమైన ఆహారాన్ని, మెరుగైన విద్యను అందించాలని వారు సూచించారు.