ప్రజాపాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అక్రమ అరెస్టులే దీనికి నిదర్శమని దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు కోడిగుడ్డుపై వెంట్రుక పీకిన చందగా ఉందని రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, మెదక్ జిల్లా టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు గుండెల్లో రెడ్డి అన్నారు. ఎలాంటి సందర్భం లేకుండా మా నాయకులైన మాజీ మంత్రి హరీష్ రావుని, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.