పేద విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుకోవడమే లక్ష్యంగా తమ సిఎస్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం అక్బర్ పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. పాఠశాలలో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 15 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు.