హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తోగుట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడుతూ యాసంగి సాగు పూర్తయినా ఇంత వరకు రైతు భరోసా వేయలేదని, ఎన్నికల్లో అందరికి రైతు భరోసా ఇస్తామని చెప్పి నేడు కోతలు విధించడం అన్యాయమన్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు, కూలీలందరికీ న్యాయం చేయాలని కోరారు.