గజ్వేల్ కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంక్ కేసులు అన్ని కలిపి దాదాపు 896 కేసులు పరిష్కారం అయ్యాయని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ప్రిన్సిపాల్, జూనియర్ సివిల్ జడ్జ్ బి. ప్రియాంక శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని చిన్న సమస్యలతో కక్షలు పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటువంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడం మార్గమని చెప్పారు.