గజ్వేల్ పట్టణంలోని పదో వార్డుకు చెందిన చిక్కుడు కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బాధిత కుటుంబీకులకు పార్టీ తరపున రూ. 2 లక్షల ప్రమాద భీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆదివారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో 97, 500 పార్టీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఇప్పటివరకు 380 మృతుల కుటుంబాలకు రూ. 7. 6కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేసిందని తెలిపారు.