ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్ తెలిపారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని మార్కండేయ పద్మశాలి సమాజంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బూర మల్లేశం, ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి పాల్గొన్నారు.