ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా ఐఎంఏ గజ్వేల్ మరియు లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ తియ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నాగమున్నయ్య, సీనియర్ డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ వల్ల రోగనిరోదక శక్తి తగ్గి మరణం సంభవిస్తుందని, నివారనే ఉత్తమం అని తెలిపారు.