75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సిద్దిపేటలో భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్ తెలిపారు. డిబిఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచార ఉద్యమం చేపట్టినట్లు భీమ్ శేఖర్ తెలిపారు.