దికొండ సారంగపాణి 22వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సారంగపాణి ఏకలవ్య శిష్యులు గడిపె మల్లేశ్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ డి. దేవవ్రత్, దీకొండ సారంగపాణి, వరంగల్ శంకర్ విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేకమైన కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వడ్డేపల్లి మల్లేశం, జగదీశ్వరచారి పాల్గొన్నారు.