హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం సఫాయిమిత్ర సురక్ష శివిర్ కార్యక్రమాన్ని పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న సఫాయి మిత్రులకు హెల్త్ క్యాంప్ గోదాం గడ్డ ఏరియాలోని బస్తి దవాఖానలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ప్రారంభించారు.