హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు గతంలో వినతి పత్రం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో అతిగతి లేక నేటికీ లబ్దిదారులు కిరాయి ఇండ్లలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.